రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణో‌గ్ర‌తలు..

265
Summer Temperature
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వేసవి ప్రారంభం నుండే రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణో‌గ్ర‌తలు 40 డిగ్రీ‌లకు సమీ‌పిం‌చాయి. ఆది‌వారం మంచి‌ర్యాల జిల్లా వెల్గ‌నూ‌ర్‌లో అత్య‌ధి‌కంగా 39.5 డిగ్రీలు, కొత్త‌గూ‌డెంలో 39.4 డిగ్రీల ఉష్ణో‌గ్ర‌తలు నమో‌దై‌నట్టు రాష్ట్ర వా తా‌వ‌ర‌ణ‌శాఖ అధికారులు తెలిపారు. రాగల మూడు రో‌జుల్లో రాష్ట్రంలో 36–38 డిగ్రీల ఉష్ణో‌గ్ర‌తలు నమో‌దయ్యే అవ‌కాశం ఉన్న‌దని పేర్కొన్నారు.

గత వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలిలో తేమ 24 శాతంగా రికార్డయింది. ఎలాంటి వర్ష సూచనలు లేవు. ఎండలు తీవ్ర‌మ‌వు‌తున్న నేప‌థ్యంలో ప్రజలు ముందస్తు జాగ్ర‌త్తలు పాటిం‌చా‌లని అధికారులు కోరారు.

- Advertisement -