యుఎస్‌లో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

4
- Advertisement -

అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానిఇక చెంది గంప రాఘవులు – రమ దంపతుల కుమారుడు ప్రవీణ్ ఎంస్ చేయడానికి 2023లో అమెరికా వెళ్లాడు. మరో మూడు నెలల్లో ఎంఎస్ పూర్తి చేసి తిరిగి వస్తాడని అనుకున్న సమయంలోనే దారుణ సంఘటన జరిగింది.

ఓ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్న ప్రవీణ్‌పై దుండగులు కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రవీణ్‌ తల్లిదండ్రులకు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు.

ఈ ఘటనపై చికాగో భారత రాయబార కార్యాలయం స్పందించింది. విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ప్రవీణ్ కుమార్ గంప అకాల మరణం మాకు బాధ కలిగించింది. కాన్సులేట్ ప్రవీణ్ కుటుంబంతో మరియు విశ్వవిద్యాలయంతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు.

Also Read:TTD:శాస్త్రోక్తంగా మహా సంప్రోక్ష‌ణ

- Advertisement -