ముగిసిన మద్యం షాపు దరఖాస్తులు..రూ.920కోట్లు

516
liqour
- Advertisement -

తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తు గుడువ నిన్నతితో ముసిగింది. ఆన్‌లైన్‌తోపాటు నేరుగానూ దరఖాస్తుల దాఖలుకు అధికారులు అనుమతి ఇచ్చారు. నిన్న సాయంత్రంతో దరఖాస్తుల గడువు ముగిసింది. ఈసారి మొత్తం 48,385 దరఖాస్తులు అందినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈ సారి మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలకుగాను బుధవారం అర్ధరాత్రి సమయానికి దాదాపు 46 వేల దరఖాస్తుల ద్వారా రూ.920 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కో దరఖాస్తు ఫారానికి రూ.2 లక్షల ఫీజు (నాన్ రీఫండబుల్) నిర్ణయించిన నేపథ్యంలో ఆదాయం అనూహ్యంగా పెరిగింది.

రెండేండ్ల కిందట మద్యం దుకాణాలకు జారీచేసిన నోటిఫికేషన్‌లో దరఖాస్తు ఫారానికి రూ.లక్ష ఫీజు నిర్ణయించారు. అప్పట్లో 41,119 దరఖాస్తులు వచ్చాయి. దీంతో రూ.411.19 కోట్ల ఆదాయం సమకూరింది. నాగర్ కర్నూల్ జిల్లాలో 45 మద్యం దుకాణాలకు మొత్తం 1064 దరఖాస్తులు నమోదయ్యాయి . కల్వకుర్తి సర్కిల్లో అత్యధికంగా 378 నమోదు కాగా అత్యల్పంగా తెల్కపల్లి సర్కిల్లో 106 దరఖాస్తులు నమోదయ్యాయి.

ఆసిఫాబాద్ జిల్లాలో 26 దుకాణాలకు 763 దరఖాస్తులు రాగా, సిర్పూర్-టీ మండలంలోని 20వ నంబర్ వైన్స్ షాపునకు జిల్లాలోనే అత్యధికంగా 81 దరఖాస్తులు చేసుకున్నారు. నేడు లక్కీ డ్రా ద్వారా మద్యంషాపులను కేటాయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆయా జిల్లాకేంద్రాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా తీసి దుకాణాలు కేటాయిస్తారు. షాపులు దక్కించుకున్నవారు ఎక్సైజ్ నిబంధనల మేరకు గడువులోగా మొత్తం ఫీజులో ఎనిమిదోవంతు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -