జులై చివర్లో పురపాలక ఎన్నికలు..

398
Municipal-elections-in-Telangana
- Advertisement -

ఈనెలాఖరులోగా తెలంగాణలో పురపాలక సంఘం ఎన్నికల నిర్వహించనున్నారు అధికారులు. ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దం చేస్తున్నారు. ఆగస్ట్ రెండో తేది వరకూ కొత్త పాలక వర్గాలు కొలువు దీరేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. తాజాగా వార్డుల వారీ ఓటర్ల జాబితాను కూడా ప్రచురించింది. కొత్త షెడ్యూల్ ను కూడా ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గతంలో జారీ చేసిన షెడ్యూల్ స్ధానంలో కొత్త షెడ్యూల్ ను ప్రకటించింది.

ఈనెల 10వ తేదిన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించనున్నారు. 11వ తేదిన జిల్లా స్ధాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేయనున్నారు. ఇక 12వ తేది వరకూ ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఇక చివరగా 14వ తేదిన వార్డుల వారీగా ఓటర్లు తుది జాబితాను ప్రకటించనున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. గత విడత ఈవీఏంల ద్వారా ఎన్నికలు నిర్వహించినా.. ఈ దఫా బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు జరగున్నాయి.

- Advertisement -