పదో తరగతి ఫలితాలు విడుదల..బాలికలదే పైచేయి..

27
tenth result
- Advertisement -

పదో తర‌గతి వార్షిక పరీ‌క్షల ఫలి‌తాలు విడు‌దలయ్యాయి. ఉదయం 11.30 గంటలకు జూబ్లీ‌హి‌ల్స్‌‌లోని ఎంసీ‌ఆ‌ర్‌‌హె‌చ్చా‌ర్డీలో విద్యా‌శాఖ మంత్రి పీ సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

విద్యా‌ర్థులు తమ ఫలి‌తా‌లను www.bse.telangana.gov.in, www.bseresults.telangana.gov.in లో చూడ‌వచ్చు. పది పరీక్షలను ఈ ఏడాది మే 23 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించగా మొత్తం 5,08,143 రెగ్యు‌లర్‌ విద్యా‌ర్థు‌లకు 5,03,579 మంది ఎస్సెస్సీ పరీ‌క్షలు రాశారు.

హాజ‌రైన రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అందులో బాలురు 87.61 శాతం, బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. మొత్తంగా టెన్త్ ఫ‌లితాల్లో 90 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక ప్ర‌యివేటు విద్యార్థుల విష‌యానికి వ‌స్తే 819 మంది హాజ‌రు కాగా, 425 మంది పాస‌య్యారు. 51.89 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు అని మంత్రి తెలిపారు .

పరీ‌క్షల్లో ఫేల్ అయిన వారికి ఆగస్టు 1 నుండి అడ్వాన్స్ సప్లీమెంటరీ పరీ‌క్షలు నిర్వహిస్తామని మంత్రి సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి వెల్లడించారు. రీకౌంటింగ్, రీఎవాల్వుఏషన్ ప్రక్రియ కూడా జరపనున్నట్టు పేర్కొన్నారు. ఫేల్ అయిన పిల్లల కు స్పెషల్ క్లాసులు తీసుకోవాలని ఆదేశాలు జారిచేశారు. టెన్త్ ఫలి‌తాల్లో సిద్దిపేట్ మొదటి స్థానం లో ఉండగా, నిర్మట్ మరియు సంగారెడ్డి రెండు మూడు స్థానాల్లో నిలిచాయి అని తెలిపారు.

- Advertisement -