తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాల డేట్ కన్ఫామ్ అయినట్లు సమాచారం. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయ్యి నెలరోజులు కావస్తుండటంతో విద్యార్థులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 28వ తేదీ లేదా 30తేదీల్లో ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. మెమోలపై మార్కులతో పాటు డివిజన్స్ పెట్టాలా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
పదో తరగతి ఫలితాలను bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లో మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం TS10ROLL NUMBER అని టైప్ చేసి 56263కు మెసేజ్ సెండ్ చేస్తే చాలు.. మీ ఫలితాలు SMS రూపంలో వస్తాయి.
Also Read:జీర్ణ సమస్యలకు చెక్ పెట్టండిలా!

