తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రవీంద్రభారతిలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 92.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. గత సంవత్సరం కంటే ఇది 1.47 శాతం అధికమన్నారు.
రెసిడెన్షియల్ ,గురుకులాలల విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులు 98 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. బీసీ గురుకులాలు, సాంఘీక సంక్షేమ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారన్నారు.
ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు 94 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు.2560 సెంటర్‌లలో పరీక్షలు జరిగాయని 1800సెంటర్లలో వాల్యుయేషన్ జరిగిందన్నారు.
విద్యార్థుల మోమోలలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్స్ తో పాటు మార్కులు ఇవ్వనుంది విద్యాశాఖ. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్నెట్‌లోని క్రింది వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
https://results.bsetelangana.org
https://results.bse.telangana.gov.in
https://bse.telangana.gov.in
Also Read:తెలంగాణ బోనాల జాతర..వివరాలివే

