నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

299
Ts Assembly
- Advertisement -

ఇవాల్టీ నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. శాసన సభతో పాటు మండలి కూడా ప్రత్యేక సమావేశం కానుంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈసమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ ఉదయం 11గంటలకు సభ ప్రారంభం కానుంది.

సభ ప్రారంభం అయిన తర్వాత మొదటగా కొత్త మున్సిపల్ బిల్లును ప్రవేశ పెడుతారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దే ఉండటంతో స్వయంగా సీఎం కేసీఆర్ ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అలాగే మండలిలోనూ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.

దీంతో పాటు గతంలో జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులకు, ఇతర నిర్ణయాలకు ఆమోదం తెలిపనున్నారు  .నూతన పురపాలక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లనుంది.

 

- Advertisement -