స్మార్ట్ రేషన్ కార్డు..ప్రత్యేకతలివే!

6
- Advertisement -

తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల కుటుంబాలు ఇప్పటికే రేషన్ కార్డులను కలిగి ఉండగా లక్షలాది మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది.

కొత్తగా జారీ చేసే ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుపై క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. కార్డులో ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్ ఉండనుండగా మరోవైపు కార్డుదారుడి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. ఇందుకోసం టెండర్లను పిలిచింది పౌరసరఫరాల శాఖ.

రేషన్ షాపులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు తెలుస్తాయి. ఏటీఎం కార్డు ఆకారంలో.. కొత్త రేషన్ కార్డు ఉండనుంది. 760 మైక్రాన్స్ మందం,85.4 మి.మీ పొడవు, 54 మి.మీ వెడల్పు కలిగిన పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలను ముద్రించనున్నారు.

Also Read:ఉన్మాదిలా మాట్లాడుతున్న రేవంత్: హరీష్‌ రావు

- Advertisement -