SIR:73 లక్షల ఓట్లు గల్లంతు!

2
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక సమీక్ష/ఎలక్టోరల్ సర్వే (SIR) ప్రక్రియ ముగిసింది. అయితే ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు డిజిటైజ్ కాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఓటర్ల సంఖ్య: రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. బీఎల్‌ఓ (BLO)ల ద్వారా ఇంటింటికీ 100 శాతం ఎలక్టోరల్ ఫారమ్‌ల పంపిణీ పూర్తయింది.

ఇప్పటివరకు 2,64,30,494 ఫారమ్‌లు మాత్రమే ఆన్‌లైన్‌లో డిజిటైజ్ అయ్యాయి.పంపిణీ అయిన ఫారమ్‌లకు, డిజిటైజ్ అయిన సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉండటంతో సుమారు 73.95 లక్షల మంది వివరాలు నమోదు కాలేదని స్పష్టమవుతోంది.ఇప్పటివరకు డిజిటైజ్ అయిన డేటా ఆధారంగా ఈ నెల 17వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ (కరడు జాబితా) విడుదల చేయనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. చిరునామా మార్పులు, మరణించిన వారి వివరాలు, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు మరియు సమాచారం లభించకపోవడం వల్లే డిజిటైజేషన్ సంఖ్య తగ్గి ఉండవచ్చని భావిస్తున్నారు.

డ్రాఫ్ట్ జాబితా విడుదలైన తర్వాత ఓటర్లు తమ పేరు అందులో ఉందో లేదో పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేరు లేని వారు లేదా సాంకేతిక కారణాల వల్ల వివరాలు నమోదు కాని వారు మళ్లీ నూతనంగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. తగిన ఆధారాలతో ఓటరు నమోదు కోసం ఫారమ్-6 (Form-6) సమర్పించి ఓటు హక్కును పునరుద్ధరించుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందకుండా డ్రాఫ్ట్ జాబితాను పరిశీలించి, అవసరమైన సవరణలు లేదా కొత్త దరఖాస్తులు చేసుకోవాలని ఎన్నికల యంత్రాంగం సూచించింది.

- Advertisement -