తెలంగాణకే తలమానికంగా నిలిచిన నూతన సచివాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 30న సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. అదేరోజు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు తమ తమ ఛాంబర్‌లో ఆసీన్నులు కానున్నారు. సచివాలయం ప్రారంభం సందర్భంగా
వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు సీఎం కేసీఆర్.
కనీవినీ ఎరుగని రీతిలో నూతన సచివాలయ నిర్మాణాన్ని అద్భుతంగా చేపట్టారు. అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునిక వసతులతో, ఎంతో విలాసవంతంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం చేపట్టారు. తెలంగాణ చరిత్ర,వైభవానికి అద్దం పట్టేలా సచివాలయం నిర్మాణం జరిగింది. 6 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సమావేశాల కోసం అధునాతన హాల్స్ నిర్మాణం….మంత్రుల పేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ ఆఫీస్‌లు ఏర్పాటు చేశారు.
సచివాలయ ప్రత్యేకతలివే..
సచివాలయం మొత్తం విస్తీర్ణం: 27.5 ఎకరాలు
భవనం, ఇతర వసతుల కోసం వినియోగించేది: 23.5 ఎకరాలు.
చుట్టూ రోడ్ల కోసం: 3 ఎకరాలు
భవనం విస్తీర్ణం: 2.4 ఎకరాలు
ల్యాండ్ స్కేపింగ్: 12 ఎకరాలు
అంతర్గత రోడ్లు, ఫుట్‌పాత్‌లు: 6 ఎకరాలు
పార్కింగ్: 3.7 ఎకరాలు , (650 కార్లు, 500 బైక్‌లు పార్క్ చేయవచ్చు)
సెంట్రల్ కోర్ట్‌యార్డ్ లాన్: 2.2 ఎకరాలు
భవనంలో..
ఏడు ఫ్లోర్లు + లాబీలు: 6 లక్షల చదరపు అడుగులు
సెంట్రల్ టవర్‌లోని మీటింగ్ హాళ్లు, స్కైలాంజ్: 52 వేల చదరపు అడుగులు
ఇతర సౌకర్యాలు: 48వేల చదరపు అడుగులు
మొత్తం: 7 లక్షల చదరపు అడుగులు
సకల వసతులు
ఉద్యోగుల కోసం ప్రతి అంతస్తులో భోజన గది.
రికార్డులు, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్, బిల్డింగ్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాలకు సరిపడా స్థలం.
సచివాలయం ఆవరణలో ఒక బ్యాంకు, ఏటీఎం, మందుల దుకాణం, పిల్లలు ఆడుకునే స్థలం, క్యాంటీన్, పెట్రోల్ బంక్, ఫైర్‌స్టేషన్, వెయిటింగ్ హాల్స్.
కొత్త దేవాలయం, మసీదు.