రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో 193 మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 3,911 సర్పంచ్ పదవులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ కనిపించింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటును వేస్తున్నారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో భద్రతా సిబ్బందిని మోహరించారు.
Also Read:మలయాళం నటి లైంగిక దాడి కేసు!
ఈ పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. అనంతరం ఓటింగ్ యంత్రాలను భద్రంగా కౌంటింగ్ కేంద్రాలకు తరలించి, మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తైన వెంటనే ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటుచేశారు.

