Telangana Rains:రెండురోజులు విద్యాసంస్థలకు సెలవు

91
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ విద్యాశాఖ. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్‌, 7 జిల్లాలకు ఆరెంజ్‌, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ.

భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికారులు జలాశయాల్లో నీటి మట్టం, ఎత్తు తక్కువ కల్వర్టులు, రహదారులు, లోతట్టు ప్రాంతాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Also Read:పిక్ టాక్ : పోటెత్తిన అందాలతో పిచ్చెక్కిస్తుంది

జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో అత్యధికంగా 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా రాజాపేట్‌లో 17.1 సెం.మీ., మెదక్‌ జిల్లా ఎల్దుర్తిలో 14.6 సెం.మీ., కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో 14.1 సెం.మీ., వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో 13.9 సెం.మీ., సిద్దిపేట జిల్లా తొగులలో 13 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Also Read:హిడింబ..మెస్మరైజ్ చేస్తుంది: అశ్విన్ బాబు

- Advertisement -