Telangana:13 నుంచి దసరా సెలవులు..

13
- Advertisement -

దసరా సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండగ దసరా. అక్టోబర్ 22న బతుకమ్మ పండుగ ఉండగా అక్టోబర్ 24న దసరాను జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం.

13రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చింది. అక్టోబర్ 13 నుండి 25 వరకు ప్రభుత్వ ,ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఉండగనుండగా ఇంటర్ కాలేజీలకు ఈ నెల 19 నుండి 25 వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఈ సెలవులను పాటించాలని విద్యాశాఖ సూచించింది.

Also Read:Harishrao:బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు

- Advertisement -