- Advertisement -
వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకోగా సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ ఏడాది నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధించనుండగా ఇందుకు సంబంధించి టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చారు.
కరోనా నేపథ్యంలో పాఠశాలలను పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత పాఠశాలల ప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కరోనాతో రెండేండ్ల విరామం తర్వాత అకడమిక్ క్యాలెండర్ గాడిన పడింది. ఈ తరుణంలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు.
- Advertisement -