- Advertisement -
సంక్షేమ పథకాల అమలు ద్వారా శాశ్వత పేదరిక నిర్మూలనకు, వివక్ష రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా దార్శనికత కలిగిన ప్రజా నాయకుడిగా ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న కృషి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రాసిన “చుక్కాని- సంక్షేమానికి పునర్ నిర్వచనం” అనే పుస్తక తొలి ప్రతిని కేటీఆర్ ఆవిష్కరించారు.
రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలులో లేవన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పుస్తకరూపంలోకి తీసుకు వచ్చిన వకుళాభరణం కృష్ణమోహన్ రావు కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -