అనుకున్నదే అయింది..సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు అయ్యాయి. అర కిలోమీటర్ పొడవునా జాతీయ రహదారి పక్కన దర్శనం ఇవ్వగా సిబ్బందితో కమిషనర్ సేకరించారు.
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవునా గురువారం సాయంత్రం సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శమిచ్చాయి.
ఈ విషయంపై సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటీనా సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లారు. అన్ని ఫారాలను సేకరించి, తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు.
దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై కన్పించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమైన కమిషనర్ ను వివరణ కోరగా జాతీయ రహదారి వెంట సమగ్ర కుటుంబ సర్వే పడి ఉన్నట్టు తనకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి, దరఖాస్తులను సేకరించామన్నారు. అర కిలో మీటర్ మేరకు దరఖాస్తు ఫారాలు పడి ఉన్నాయని చెప్పారు.
Also Read:TTD: కార్తీక మహా దీపోత్సవానికి విస్తృత ఏర్పాట్లు