రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

32
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య 150కి పైనే నమోదైంది. రాష్ట్రంలో కొత్త 16,319 కరోనా పరీక్షలు నిర్వహించగా, 155 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాదులో 81 కేసులు.. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11, సంగారెడ్డి జిల్లాలో 8 కేసులు గుర్తించారు.

తెలంగాణలో ఇప్పటివరకు 7,94,184 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,166 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నేపథ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకాస్త పెరిగింది. అదే సమయంలో 59 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. ఇంకా 907 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

- Advertisement -