- Advertisement -
దసరా సెలవుల తర్వాత నుంచి స్కూళ్లు మళ్లీ ఇవాళ తెరచుకుంటున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో స్కూళ్లకు వారం రోజులు అదనంగా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. స్కూళ్లు 14న మొదలవ్వాల్సి ఉన్నా… సమ్మె జరగడంతో… 19 వరకూ సెలవుల్ని పెంచింది.
20న ఆదివారం కావడంతో… మొత్తం 23 రోజులు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. చాలామంది స్కూల్ బస్సు డ్రైవర్లు ఆర్టీసీ బస్సులను నడిపించారు. ఇవాళ స్కూళ్లు తెరచుకోవడంతో… దాదాపు 1000 స్కూల్ బస్సులు తిరిగి స్కూళ్లకు వెళ్లిపోయాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎర్పడకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది.
- Advertisement -