తెలంగాణ ఓటర్ల జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా 2,73,18,603 మంది ఓటర్లున్నారని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. పురుషుల ఓటర్లు1,37,87,920 మంది ఉండగా,మహిళా ఓటర్లు 1,35,28,020 మంది ఉన్నారని చెప్పారు. 2,663 మంది ట్రాన్స్‌జెండర్లు ,సర్వీస్ ఓటర్లు 9,451 ఉన్నారని తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి తుది ఓటర్ల జాబితా వివరాలు పంపించామన్నారు. ఓటరు జాబితా అవకతవకలపై కోర్టులో పిటిషన్లు ఉన్న కారణంగా ఓటర్ల తుది జాబితా ప్రచురణకు కేంద్ర ఎన్నికల అనుమతి కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఈసీ నుంచి అనుమతి రాగానే తుది జాబితా విడుదల చేసి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
అక్టోబర్ 8న జాబితా ప్రకటించాల్సి ఉన్నప్పటికి హైకోర్టులో కేసు కారణంగా జాప్యమైంది. ఓటర్ల జాబితా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం శుక్రవారం జాబితాను విడుదల చేసింది. 2014 ఎన్నికల్లో 2.81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.