- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 412 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,674కు చేరింది.
అదే సమయంలో 216 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 2,99,042 మంది కరోనా నుండి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 3,151 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,285 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 103 మందికి కరోనా సోకింది. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,867కి చేరింది.
- Advertisement -