- Advertisement -
అక్టోబర్ 3 నుంచి రేషన్ షాపుల బంద్ కు తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం పిలుపునిచ్చింది. కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో నిరసన చేయాలని తీర్మానించినట్లు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజు ప్రకటించారు.
1, 2 తేదీల్లో డీలర్లంతా ఉపవాస దీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఆరు నెలల కమీషన్ రూ.120కోట్లతో పాటు గన్నీ బ్యాగుల డబ్బులు రూ.6కోట్లు, కేవైసీకి సంబంధించి రూ.15 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని వివరించారు.
Also Read:TTD:ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ అప్‌డేట్
- Advertisement -

