సన్నబియ్యం…పక్కదారి?

8
- Advertisement -

తెలంగాణలో పక్కదారి పడుతోంది సన్నబియ్యం. కొంతమంది అక్రమార్కులు సన్నబియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కేజీకి రూ.10 నుండి రూ.15 ఇచ్చి లబ్ధిదారుల నుండి కొనుగోలు చేస్తున్నారు దళారులు.

తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇస్తున్న సన్నబియ్యం భారీగా అక్రమ రవాణాకు గురవుతున్నాఅధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మంథని, పెద్దపల్లి, గోదావరిఖని లాంటి బార్డర్ ప్రాంతాలలో మధ్యతరగతి లబ్ధిదారుల నుండి సన్నబియ్యం సేకరించి, మహారాష్ట్రలోని సిరోంచ ప్రాంతానికి తరలిస్తున్నారు దళారులు. మార్కెట్లో కేజీ ధర రూ.50 నుండి రూ.90 ఉన్నందున భారీగా పక్కదారి పడుతోంది సన్నబియ్యం. ఇప్పటికైనా అధికారులు నిద్ర లేచి సన్నబియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.

Also Read:జూబ్లీహిల్స్..పోటీకి టీడీపీ దూరం

- Advertisement -