- Advertisement -
ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అతి బారి వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొత్తగూడెం, హనుమకొండ, జనగాం, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇతర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మరో రెండు రోజులు సెలవులు పొడిగించింది ప్రభుత్వం.
Also Read:సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం పొడగింపు
- Advertisement -

