అలర్ట్.. భారీ వర్షాలు

5
- Advertisement -

తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఇవాళ, రేపు ఆరెంజ్​ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని, దీని ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదని తెలిపింది.

హైదరాబాద్ సహా తెలంగాణలోని అనేక జిల్లాల్లో గంటకు 50 – 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 5 – 7 డిగ్రీలు తగ్గే ఛాన్స్ ఉందని తెలిపింది.తెలంగాణలోని కరీంనగర్​ జిల్లా ఖాసింపేటలో అత్యధికంగా11.4 సె.మీ వర్షపాతం నమోదైంది.

సికింద్రాబాద్, అత్యధికంగా రామచంద్రాపురంలో 5.5 సె.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో పద్మారావు అనే వ్యక్తి ఇంట్లోకి భారీగా వరద నీరు చేరింది. పద్మారావు ఆ సమయంలో బాగా మద్యం తాగి ఉండడంతో నీళ్లలోనే మునిగి చనిపోయాడు.

Also Read:వాట్సప్ గవర్నెన్స్ ..గేమ్ ఛేంజర్!

- Advertisement -