తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో శాలువ

6
- Advertisement -

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు,సంప్రదాయాలు, మిషన్ భగీరథ, కాళేశ్వరం నీటి పారుదల ప్రాజెక్టు గొప్ప తనాన్ని తెలిపే విధంగా విజయ్ నేసిన శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.టీ.రామారావు శనివారం ఆవిష్కరించారు.బంజారాహిల్స్ నందినగర్ లోని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ ను కేటీఆర్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకుడు జాన్సన్ నాయక్ తదితర ప్రముఖులు అభినందించారు.

“పోగు బంధం – ఫోన్ బంధం” అనే వినూత్న భావనతో రూపొందిన ఈ శాలువ తెలంగాణ చరిత్ర, అభివృద్ధిని ఒకే వేదికపై చూపిస్తుంది. ఈ అరుదైన శాలువను సిరిసిల్లకు చెందిన నేతన్న నల్ల విజయ్ కుమార్ నేసి సిద్ధం చేశారు. సంప్రదాయ నెయ్యం కళకు ఆధునిక టెక్నాలజీని జోడిస్తూ రూపొందించిన ఈ ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది.

ఈ శాలువపై తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, ప్రజల సంప్రదాయాలు స్పష్టంగా ప్రతిబింబించాయి. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాల ప్రతీకలను కూడా ఇందులో పొందుపరిచారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి వివరాలు మొబైల్‌లో కనిపించేలా ప్రత్యేకంగా రూపకల్పన చేశారు.

Also Read:Messi: కోల్‌కతాలో మెస్సీ

ఈ సందర్భంగా వినూత్న ఆలోచనతో శాలువ రూపొందించిన నల్ల విజయ్ కుమార్‌ను కేటీఆర్ అభినందించారు. తెలంగాణ నేతన్నల సృజనాత్మకత, నైపుణ్యానికి ఇది నిదర్శనమని పేర్కొంటూ, ఇలాంటి ప్రయత్నాలు మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

- Advertisement -