ప్రాజెక్టులకు జలకళ…రైతుల హర్షం

223
srisailam
- Advertisement -

ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నది ఎగువ గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులు నిండిపోయాయి. ఆల్మట్టి, నారాయణపురం నిండడంతో జూరాల మీదుగా జలాలు శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరాయి. అక్కడి నుంచి జల విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు చేరుతోంది.

శ్రీశైలం ప్రాజెక్ట్

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

ఇన్ ఫ్లో : 29 వేల 429 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 42 వేల క్యూసెక్కులు

పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు

ప్రస్తుతం నీటి మట్టం : 848.30 అడుగులు

పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు

ప్రస్తుతం నీటి నిల్వ : 76.4876 టి.ఎం.సి లు

ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

కృష్ణ నది అప్డేట్….

నారాయణ పుర డ్యామ్ కి భారీగా వరద నీరు…

ఆల్మట్టి నుండి 1,80,000 క్యూసెక్ ల ఇన్ ఫ్లో…

జూరాల వైపు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ…

నారాయణపుర డ్యామ్ నుండి 1,82,290 క్యూసెక్ ల వరద నీటిని కృష్ణ నదిలోకి వదులుతున్న అధికారులు…

ఎగువ కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి కి భారీగా వరద.

జూరాల అప్డేట్

జూరాల ప్రస్తుత నీటి మట్టం..318.070

జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.516

జూరాల పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 9.657 టీఎంసీ..

జూరాల ప్రస్తుత నీటి నిల్వ 6.859 టీఎంసీ

ఇన్ ఫ్లో 14,000 క్యూసెక్ లు

ఔట్ ఫ్లో 31,825క్యూసెక్ లు
.

నల్గొండ :
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం : 556.50 అడుగులు.

ఇన్ ఫ్లో : 42 378 క్యూసెక్కులు.

అవుట్ ఫ్లో : 10 622 క్యూసెక్కులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.

ప్రస్తుత నీటి నిల్వ : 224.3275 టీఎంసీలు.

- Advertisement -