9 గంటలకు 9.37 శాతం పోలింగ్

223
voters
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9గంటల వరకూ 9.37శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వైపు అడుగులు వేశారు.

పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఇంకా పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. మరికొన్ని చోట్ల పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు ఉన్న చోట లైటింగ్‌ సరిగా లేదని.. పార్టీల గుర్తులు సరిగా కనబడటంలేదని ఓటర్లు ఆందోళన చేస్తున్నారు.

- Advertisement -