వివాదంలో ‘భీమ్లా నాయక్‌’ సాంగ్..

193
Bheemla Nayak
- Advertisement -

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా నిన్న ఈ సినిమా నుంచి భీమ్లా నాయక్‌ టైటిల్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ పాటలో పోలీసుల గురించి రాసిన కొన్ని పదాలపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి రాసిన కొన్ని పదాలు పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్‌ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్‌లో తెలంగాణ పోలీసులు పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసులు అని తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగ్గొట్టమని చురకలు అంటించారు. అంతేకాదు పోలీసుల గురించి వివరించేందుకు రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకలేదా అంటూ డీసీపీ తన ట్వీట్‌‌లో పేర్కోన్నారు. డీసీపీ చేసి ఈ ట్వీట్‌పై భీమ్లా నాయక్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.. ఇక ఈ పాటకు రామజోగయ్య సాహిత్యం అందించగా.. థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. నిత్యా మీనన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -