కాంగ్రెస్ గోదావరి జలదీక్ష భగ్నం…నాయకుల అరెస్ట్

185
congress
- Advertisement -

కాంగ్రెస్ నేతలు చేపట్టిన జలదీక్షను భగ్నం చేశారు పోలీసులు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కడే అరెస్ట్ చేశారు. గ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావును లక్ష్మీదేవిపల్లి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో అశ్వాపురం మండలంలో తలపెట్టిన జల దీక్షకు హాజరయ్యేందుకు కొత్తగూడెం చేరుకున్న ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.

కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్‌ని పోలీసులు చుట్టుముట్టారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, జగిత్యాల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు బండ శంకర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

అలాగే సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,సంపత్,పోదెం వీరయ్య తదితరులను అరెస్ట్ చేశారు పోలీసులు.

- Advertisement -