ఈ నెల 8 న ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు. కాజీపేట వ్యాగన్, ఓరలింగ్ సెంటర్ తో పాటు వరంగల్ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ ను ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని తెలంగాణకు రానుండడంతో పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణపై మోడీ సర్కార్ చిన్నచూపు వహిస్తుందనే విమర్శ ఉంది. రాష్ట్రానీకి రావలసిన నిధుల విషయంలోనూ, ఇచ్చిన హామీల అమలు విషయంలోనూ తెలంగాణ కు మోడీ సర్కార్ మొండి చేయి చూపిస్తూనే ఉంది. దీంతో మోడీకి తెలంగాణ వచ్చే అర్హత ఉందా అనే ప్రశ్నలు సాధిస్తున్నారు చాలమంది. గుజరాత్ పై కురిపించిన ప్రేమ తెలంగాణపై ఎందుకు చూపరని తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు.
రాష్ట్రంలో శంకుస్థాపనలు, కల్లబొల్లి కబుర్లతో కాలం వెల్లడిస్తున్నారే తప్పా . ఆచరణలోకి వస్తున్న ప్రాజెక్ట్ లు, హామీలు శూన్యం అని మోడీ సర్కార్ పై తెలంగాణ ప్రజానీకం విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రనికి రావాలంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాకే తెలంగాణలో అడుగు పెట్టాలని మోడీకి చురకలు అంటిస్తున్నారు కొందరు నేతలు. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ కూడా ప్రధాని మోడీపై ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయనందుకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read:షిండే స్కెచ్ యేనా.. ఎన్సీపీలో కలకలం?
ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీ పేట లో కోచ్ ఫ్యాక్టరీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలను మోడీ గాలికి వదిలేశారని ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తరువాత రాష్ట్రానికి రావాలని మంత్రి కేటిఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా అధికారబద్దంగానే ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నప్పటికి.. మోడీ టూర్ ను రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. మరి తెలంగాణ ప్రజలు మోడీ టూర్ ను ఎంతమేర స్వాగతిస్తారో చూడాలి.
Also Read:కాంగ్రెస్ ఐక్యత అంతా డొల్లే..!