Revanth:ప్రపంచ వేదికపై తెలంగాణ

17
- Advertisement -

దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్​. వేర్​ ట్రెడిషన్​ మీట్స్​ ఇన్నోవేషన్​ ట్యాగ్​ లైన్​తో ఈ ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది.

మన బతుకమ్మ, బోనాల పండుగలు, మన చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచింది చార్మినార్​. మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్​, పోచంపల్లి ఇక్కత్​, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం టీ హబ్​.. స్కైరూట్ ఏరోస్పేస్.. విభిన్న రంగాల మేళవింపు ఉట్టిపడేలా తయారు చేసిన వాల్​ డిజైనింగ్​ ఈ పెవిలియన్​కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ప్రపంచానికి చాటిచెప్పటంతో పాటు.. ’ఇన్ వెస్ట్ ఇన్​ తెలంగాణ’ పేరుతో ముస్తాబు చేసిన ఈ పెవిలియన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే అపారమైన అవకాశాలున్న తెలంగాణ’, ‘పెట్టుబడులకు దేశంలోనే మొట్టమొదటి గమ్యస్థానం తెలంగాణ’ అనే నినాదాలు​ పెవిలియన్​కు స్వాగతం పలుకుతున్నాయి.

భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు.. మీ కోసమే తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి హోర్డింగ్​ ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా ఉంది. సంప్రదాయ మేళవింపుతో ఆవిష్కరణలు.. జీవ వైద్య రంగానికి డేటా సైన్స్​ జోడీ.. ప్రతిభను ప్రతిబింబించే సాంకేతికత.. పరిశ్రమల నుంచి సమగ్రత.. స్థిరత్వం నుంచి ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుందనే తెలంగాణకున్న అనుకూలతలన్నింటినీ దీనిపై ఇంగ్లిష్​ కోట్స్​తో ప్రదర్శించారు.

Also Read:తినేటప్పుడు నీరు తాగుతున్నారా?

- Advertisement -