గ్రామపంచాయతీ ట్రిబ్యునల్ ఏర్పాటు ..

661
telangana
- Advertisement -

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 48 జారీ చేసింది. ట్రిబ్యునల్ మార్గదర్శకాల కోసం జీవో నెంబర్ 50 ని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణా పంచాయతీ రాజ్ యాక్టు సెక్షన్ 141 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది.

ఈ ట్రిబ్యునల్ సవరణ చట్టం సెక్షన్ 37, సబ్ సెక్షన్ (6) ప్రకారం గ్రామ పంచాయితీల వివాదాల అప్పీల్స్ ను విచారించి, తీర్పు చెప్పనుంది. ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడమైనది.

గ్రామ పంచాయితీ ట్రిబ్యునల్‌లో చైర్మన్, ఇతర సభ్యుల పదవీకాలం మూడేళ్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ట్రిబ్యునల్ చైర్మన్, ఇతర సభ్యులకు రెమ్యునరేషన్, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది.

- Advertisement -