తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సిబ్బంది, భద్రతా బలగాలు తుది ఏర్పాట్లు చేపట్టి పోలింగ్ కేంద్రాల్లో మోహరయ్యారు.
ఈ దశలో మొత్తం 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. గ్రామాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొన్నది. ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయనే అంచనా ఉంది.
తొలి విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సమగ్ర భద్రతా చర్యలు చేపట్టారు. ప్రత్యేక పట్రోలింగ్ టీములు, క్విక్ రెస్పాన్స్ టీములు కీలక ప్రాంతాల్లో మోహరించబడ్డాయి.
పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అదే రోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉండటంతో గ్రామాల్లో రాజకీయ ఉత్కంఠ పెరిగింది.
Also Read:BB9:డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్?

