పంచాయతీ ఎన్నికలపై అప్‌డేట్

4
- Advertisement -

తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఓటర్ జాబితాలో సవరణలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. మొదట ఓటర్ జాబితాను విడుదల చేసి.. ఆ తర్వాత మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది.

రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. ఓటర్ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి.. వచ్చే నెల 2వ తేదీన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఈనెల 28వ తేదీన వార్డులు, పంచాయతీల వారీగా ఓటర్ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

 

- Advertisement -