ధరణి…ఎన్‌ఆర్‌ఐల అభినందనలు!

181
dharani
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి వెబ్‌ సైట్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూస‌రి మాట్లాడుతూ..విప్లవాత్మ‌కమైన ధరణి పోర్టల్ ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ జేస్తున్నానని తెలిపారు.

టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ అధ్య‌క్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ..తెలంగాణ ముఖ్యమంత్రి ధరణి పోర్టల్ ప్రారంభించి మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యల పరిష్కారం మన ఈ ధరణి పోర్టల్ ద్వారా సులభతరం చేసినందుకుగాను కెసిఆర్ నా ప్రతేక్య కృతజ్ఞతలు అన్నారు.

ధ‌ర‌ణి పోర్ట‌ల్ దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని టీఆర్ఎస్ సింగపూర్ ‌శాఖ సభ్యులు రావు రంజిత్ కుమార్, అరుణ్ గౌడ్ , జితేంధర్ రెడ్డి తెలిపారు. ఈ పోర్ట‌ల్ ప్రారంభంతో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో న‌వ శ‌కానికి తెలంగాణ ప్ర‌భుత్వం నాంది ప‌లికింద‌న్నారు.

దేశంలోనే మొదటిసారిగా దళారీ వ్యవస్థను పక్కనపెట్టి నేరుగా కొనుగోలుదారునికి అమ్మకందారునికి వారధిలా ఉండేలా ఈ ధరణిని రూపొందించారని పోర్టల్ ప్రారంభోత్సవం సందర్బంగా టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు చిరుత పేర్కొన్నారు.

- Advertisement -