తెలంగాణనే నెంబర్ వన్ !

113
- Advertisement -

ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ అన్నీ రంగాలల్లోనూ దూసుకుపోతుంది. కే‌సి‌ఆర్ పాలనలో తెలంగాణ సాధిస్తున్న పురోగతి ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. బెస్ట్ రూరల్ డెవలప్ మెంట్, దేశంలోనే అత్యధిక ఉద్యోగ రూపకల్పన, దేశంలోనే లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సాధించిన ప్రగతి అనేకం. అందుకే బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణను చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి. కాగా దేశంలో అత్యధిక తలసరి ఆదాయం సాధిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ మరోసారి నెంబర్ ఒన్ గా నిలిచింది. .

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణలో రూ. 3,08,732 గా తలసరి ఆదాయం నమోదైందని.. ఇది ఇతర రాష్ట్రాలతో పోల్చితే దేశంలోనే అత్యధికం అని గణాంకాలు & కార్యక్రమాల మంత్రిత్వ శాఖ లిఖిత పూర్వకంగా డేటాను వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్నాటక, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయంటూ తెలిపింది. దీంతో మరోసారి అన్నీ రాష్ట్రా ప్రభుత్వాల దృష్టి తెలంగాణపై పడింది. రాష్ట్రంలో కే‌సి‌ఆర్ విజన్ ఎలా ఉందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. అందుకే ప్రస్తుతం తెలంగాణ మోడల్ దేశమంతా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే కే‌సి‌ఆర్ అడుగులు వేస్తున్నారు రాబోయే రోజుల్లో దేశమంతా తెలంగాణ మోడల్ చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చాలా రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణ తలసరి ఆదాయం విషయంలో కూడా అగ్రస్థానంలోకి రావడం నిజంగా హర్షించాల్సిన విషయం.

Also Read:సభ వాయిదా..మరి ప్రియాంకగాంధీ సంగతేంటి?

- Advertisement -