తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఇవాళ సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభంకానుంది. ఉదయం 6గంటల తర్వాత సచివాలయంలో సుదర్శనయాగం, చండీయాగం వాస్తుయాగంతో సచివాలయ ప్రారంభవేడుకలు ఆరంభం అయ్యాయి. మధ్యాహ్నం 1గంట 20నిమిషాల నుంచి 1గంట 30నిమిషాల మధ్య పూర్ణాహూతి యాగం నిర్వహించిన తర్వాత నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం. అనంతరం ఆరవ అంతస్తులోని తన ఛాంబర్లో సీఎం కేసీఆర్ తొలి సంతకం చేయనున్నారు.
ఇక నూతన సచివాలయం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవనుంది. ఇక్కడినుండే అన్నిశాఖల అధికారులు, మంత్రులు పనిచేయనున్నారు. సకల హంగులతో సచివాలయ నిర్మానం జరిగింది. ఇక నూతన సచివాలయంలో ఏఏ అంతస్తులో ఏఏ శాఖలున్నాయంటే.
గ్రౌండ్ ఫ్లోర్ ..
ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్ మెంట్
మైనారిటీల సంక్షేమ శాఖ
లేబర్ డిపార్ట్‌మెంట్
రెవెన్యూ డిపార్ట్‌మెంట్
రెవెన్యూ శాఖ
మొదటి అంతస్తు ..
గృహ విభాగం.
విద్యాశాఖ.
పంచాయతీరాజ్ విభాగం.
రెండో అంతస్తు ..
వైద్య, ఆరోగ్యశాఖ
ఆర్థిక శాఖ
ఎనర్జీ డిపార్ట్‌మెంట్
పశు సంవర్ధకశాఖ
మూడవ అంతస్తు..
వ్యవసాయశాఖ
పురపాలక శాఖ
ఐటీ డిపార్ట్‌మెంట్
ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్
ప్రణాళికా విభాగం
గిరిజన సంక్షేమ శాఖ
మహిళా, శిశు సంక్షేమ శాఖ.
నాలుగో అంతస్తు..
అటవీ పర్యావరణ శాఖ
లా డిపార్ట్‌మెంట్
యువజన సర్వీసుల శాఖ
బీసీ సంక్షేమ శాఖ
సీఏఎఫ్ డిపార్ట్‌మెంట్
నీటిపారుదల శాఖ
ఐదవ అంతస్తు ..
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్
రహదారులు, భవనాల శాఖ
ఆరవ అంతస్తు ..
ముఖ్యమంత్రి కార్యాలయం.
28 ఎకరాల విస్తీర్ణంలో 10,51,676 చదరపు అడుగులలో నూతన సచివాలయ భవన నిర్మాణం జరిగింది. భవనం ఎత్తు 265 అడుగులు. 2 నుంచి 6 అంతస్తుల్లో సీఎం, మంత్రుల కార్యాలయాలుండనున్నాయి. 2.5లక్షల లీటర్ల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్,సోలార్ విద్యుత్,నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. 650 కార్లు, 500 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉండనుంది. అలాగే అత్యాధునిక వసతులతో కాన్ఫరెన్స్ మరియు డైనింగ్ హాల్స్ నిర్మించారు.