కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

3
- Advertisement -

శాసనమండలికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ్య స్వీకారం చేశారు. పట్టభద్రులు, టీచర్‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్సీలు నూతనంగా ఎన్నికయ్యారు. వీరితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్‌, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్‌ నుంచి దాసోజు శ్రవణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌ పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య విజయం సాధించారు. అలానే ఖమ్మం టీచర్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Also Read:TTD:భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు

- Advertisement -