ఈ మున్సిపాలిటీల్లో హంగ్..!

4
- Advertisement -

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి నెలకొంది. జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం, బోధన్, వేములవాడ, గద్వాల, ఆలియాబాద్ వంటి ప్రాంతాల్లో ఎవరికీ పూర్తి ఆధిక్యం రాలేదు. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది.

ప్రత్యేకంగా జనగామ మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైర్మన్ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థులు కీలకమవడంతో నలుగురు ఇండిపెండెంట్లు తమ మద్దతుకు షరతులు పెడుతున్నట్లు సమాచారం. మిగిలిన వార్డుల్లో గెలిచిన అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలియాబాద్‌లో ఓ అభ్యర్థిని కొందరు వ్యక్తులు కారులో తీసుకెళ్లిన ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 876 వార్డుల్లో, బీఆర్ఎస్ 462 వార్డుల్లో, బీజేపీ 138 వార్డుల్లో విజయం సాధించాయి. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకోవడం విశేషం. తుది ఫలితాలు రాగానే రాజకీయ సమీకరణాలు మరింత స్పష్టమవనున్నాయి.

Also Read:12 ఏళ్ల టీ20 రికార్డు బ్రేక్!

- Advertisement -