మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని తెలిపారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా రేపటి నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు.ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగనుంది.
కోర్టు వివాదాల్లో ఉన్న మున్సిపాల్టీలను మినహాయించి మొత్తంగా 116మున్సిపాల్టీలు, 7కార్పొరేషన్ల లో కొత్త పాలకవర్గాల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే మున్సిపాల్టీల వారీగా, చైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియను సైతం ప్రభుత్వం పూర్తిచేసింది. ఎన్నికల సంఘం కూడా ముందస్తు ఏర్పాట్లపై ఇప్పటికే అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది.
Also Read:‘ఓం శాంతి శాంతి శాంతిః’..కనెక్ట్ అయ్యే మూవీ!
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
30న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
31న నామినేషన్ల పరిశీలన
వచ్చే నెల 3న నామినేషన్ల ఉపసంహరణ
11న పోలింగ్
12న రిపోలింగ్
13న కౌంటింగ్ పలితాలు

