తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు.120 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు జనవరి 22న పోలింగ్ జరుగగా కరీంనగర్ కార్పొరేషన్ మినహా మిగితా వాటికి ఫలితాలు ఇవాళ వెల్లడికానున్నాయి.
ఇవాళ సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈనెల 27న మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల ఉండనుండగా 29న కరీంనగర్ మేయర్ ఎన్నిక జరగనుంది.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఫలితాల వెల్లడిలో 5 రౌండ్ల నుంచి 24 రౌండ్లు వరకు ఉండనున్నాయి. కౌంటింగ్ ముగిసిన తర్వాత మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాజకీయ పార్టీలు మేయర్, ఛైర్‌పర్సన్ల పేర్లను… ఏ, బీ ఫారాల ద్వారా ఈసీకి ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ నెల 26న ఉదయం 11 గంటల వరకు ఏ ఫామ్, 27న ఉదయం 10 గంటల వరకు బీ ఫామ్ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఇక రాజకీయ పార్టీలు.. ఎమ్మెల్యేలను విప్‌లుగా నియమించాయి. విప్ ఎవరన్నది ఆయా పార్టీలు 26న ఉదయం 11 గంటలలోపు తమకు తెలియజేయాలని.. విప్ జారీ వివరాలను కూడా 27 ఉదయం 11:30 గంటల వరకు ఇవ్వాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.