కేసీఆర్ వెంటే మాదిగ, మాదిగ ఉప కులాలు

352
madiga Sangam pressmet
- Advertisement -

ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే మాదిగ, మాదిగ ఉప కులాలు ఉంటాయని తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు స్పష్టం చేశారు. వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో లో టిఆర్ఎస్ అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మా ఆడబిడ్డ అని పేర్కొన్నారు. ఆమెను లక్షలాది మెజార్టీతో గెలిపించుకుని మళ్లీ పార్లమెంటుకు పంపుతామని చెప్పారు.ఆదివారం నిజామాబాదు ప్రెస్ క్లబ్ లో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, బేడ, బుడగ జంగాల హక్కుల దండు వ్యవస్థాపకులు చింతల రాజలింగం, రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి హనుమంతు మీడియాతో మాట్లాడారు.

మాదిగలు మాదిగ ఉపకులాల అభివృద్ధి ఇ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతుందని అని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు.ఎస్సీ వర్గీకరణ అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ పార్టీ చూపిన చొరవ మరువలేనిదన్నారు. మాదిగ, మాదిగ ఉపకులాల డిమాండ్లు టిఆర్ఎస్ వాళ్లనే పరిష్కారం అవుతాయని నమ్మకంతో ఉన్నామన్నారు.మాదిగలు, మాదిగ ఉపకులాల న్యాయమైన డిమాండ్లకు మద్దతు కూడగట్టేందుకు ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం ఎంపీ కవిత తో భేటీ అయిందని, ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు. మా డిమాండ్లపై కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని కవిత హామీనిచ్చారని ఎమ్మార్పీఎస్ నేతలు చెప్పారు.

సీఎం కేసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్ లు తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపారు. గతంలో మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని, టిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాదిగలకు, మాదిగ ఉపకులాల కు ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు.టీఆర్ఎస్ పోటీ చేస్తున్న 16 స్థానాలలో టిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మా ఆడబిడ్డ కవితక్క గెలుపుకోసం ఇంటింటి ప్రచారం చేస్తామన్నారు. కవితక్కను లక్షలాది మెజార్టీతో గెలిపించాలని మాదిగ, మాదిగ ఉప కులాలకు తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు.

- Advertisement -