తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎన్నికల జోరు కొనసాగుతోంది. కొద్ది నెలల క్రితమే శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రెండు రోజుల క్రితమే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఆ ఓట్ల లెక్కింపు చేపట్టకముందే మరో ఎన్నికలు వచ్చాయి. త్వరలో పదవీకాలం ముగియనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికనుగుణంగా ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వాహణపై చర్చించారు. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని సమాచారం.
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఈ నెల నాలుగో వారంలో ప్రారంభం కానుంది. వచ్చే నెల 14వ తేదీ లోపు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాతే ఈ ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ షెడ్యూల్ ఇదే..
మొదటి దశ పోలింగ్ తేదీ: 06.05.2019
రెండో దశ పోలింగ్ తేదీ: 10.05.2019
మూడో దశపోలింగ్ తేదీ: 14.05.2019