తెలంగాణ ఉద్యమ చరిత్రను 10వ తరగతి పాఠ్యపుస్తకాల నుండి తొలగించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 60 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు, అవమానాలు, అణచివేతల గురించి భావితరానికి తెలియజేసేందుకు, విద్యార్థుల పాఠ్యపుస్తకాలలో ప్రచురించిన సిలబస్ ను తొలగించింది రేవంత్ సర్కార్.
రేవంత్ రెడ్డి ఎప్పటికీ తెలంగాణకు వ్యతిరేకమేనని పలువురు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేసే కుట్రలో ఇది భాగమేనని దుయ్యబడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత, తెలంగాణ ప్రజలంతా కలిసి పోరాడిన తీరును రాబోయే తరాలకు తెలియచేసే విధంగా ఉండే సిలబస్ ను విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో చేర్చింది ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్ర సాధనకు వ్యతిరేకంగా పోరాడిన రేవంత్ రెడ్డి, ఎప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర సాధన పోరాటాన్ని గౌరవించలేడని విమర్శిస్తున్నారు తెలంగాణ వాదులు.
Also Read:గుజరాత్ ప్రమాదం..విమానంలో మాజీ సీఎం!

