ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి

11
- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. పట్టభద్రుల నామినేషన్లలో 32 తిరస్కరణకు గురికాగా ఉపాధ్యాయుల నామినేషన్లలో 1 తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.

మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి అయింది.

పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 100 మంది నామినేషన్ వేయగా 32 మంది నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరన 68 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది, 16మంది నామినేషన్లు ఆమోదం పొందాయి.

Also Read:రాజకీయాలకు దూరం..చిరు ప్రకటన!

- Advertisement -