గ్రూప్‌ 1 పరీక్షపై ప్రభుత్వ ప్రకటన

7
- Advertisement -

హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణం లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో సమావేశమయ్యారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు. ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజా నర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ పాల్గొన్నారు.

గ్రూప్ 1 పరీక్షలు, జిఓ 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్హులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రులు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, విద్యార్థులు అందరికి న్యాయం జరిగేలా చర్యలు, ఏ ఒక్క అభ్యర్థి.నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా ఉన్నతాధికారులతో చర్చించారు మంత్రులు. రేపు గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లపై సమగ్ర ప్రకటన చేయనుంది ప్రభుత్వం.

Also Read:ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేదు:తుమ్మల

- Advertisement -