- Advertisement -
హైదరాబాద్‌లో ఫతేనగర్‌లో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల పనులను పర్యవేక్షించినట్లు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ(మురుగు నీటి శుద్ధి కేంద్రం)ని పనుల పురోగతిని మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్టీపీల్లో వినియోగించే సాంకేతికతపై కేటీఆర్ ఆరా తీశారు. ఎస్టీపీ పనులు చేస్తున్న కార్మికులతో కేటీఆర్ మాట్లాడారు. 1259 ఎంఎల్‌డీ కెపాసిటీతో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీలు 2023 ఎండకాలం నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ మారబోతుందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
- Advertisement -

