మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం..

209
KTR_
- Advertisement -

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి వరుసగా రెండోసారి ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో 49వ W.E.F. సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్… మంత్రి కేటీ రామారావుకు ఆహ్వానం పంపించారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాలకు సాధారణంగా ప్రభుత్వంలోని ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం లభిస్తుంది. కానీ రాష్ట్రమంత్రిగా కొనసాగుతున్న కేటీఆర్‌కు వరుసగా రెండోసారి ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో పాల్గొనాలని ఆహ్వానం అందడంపై తెలంగాణ వాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

KTR

ఈ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు సుమారు మూడు వేల మంది హాజరుకానున్నారు. ఎకనామిక్‌ ఫోరం నుంచి మంత్రి కేటీఆర్‌కు అందిన ఆహ్వాన పత్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాల వంటి పలు అంశాలను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తెలంగాణ ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్, డిజిటలైజేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ పాలనలో పారదర్శకత వంటి కీలకమైన అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తీసుకున్న సంస్కరణలు, ప్రభుత్వ ఎజెండా ప్రాధాన్యతలను ఈ సమావేశాల్లో వివరించాల్సిందిగా ఆయన మంత్రి కేటీ ఆర్‌ను కోరారు.

KTR- wef అయితే తనకు వరుసగా రెండోసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు ఆహ్వానం లభించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం. తెలంగాణ ప్రభుత్వ పనితీరు, విధానాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం గుర్తించడం సంతోషకరమైన విషయం అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సమావేశాలకు తనను ఆహ్వానించిన ప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -