ప్రజల సహకారంతోనే స్వచ్ఛ సిద్దిపేట సాధ్యమవుతుంది :హరీశ్‌రావు

65
harish
- Advertisement -

ప్రజల సహకారంతోనే స్వచ్ఛ సిద్ధిపేట సాధ్యమన్నారు మంత్రి హరీశ్‌రావు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో సిద్ధిపేట అర్బన్‌ మండలంలోని 137మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, కౌన్సిలర్లు అడ్డగట్ల కావేరి, భాగ్యలక్ష్మి, టీఆర్‌ఎస్‌ నాయకులు మోయిజ్‌, బందారం రాజు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ నిత్యం ఆరగంట నడవడంతోపాటు యోగా చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ కవర్ల్‌ను వాడొద్దని పిలుపునిచ్చారు. ప్రతి పేదింటి ఆడబిడ్డ పెండ్లికి సీఎం కేసీఆర్‌ లక్షా116రూపాయాలు ఆర్ధిక సహాయం ఇస్తున్నామన్నారు. ఆడపిల్ల పెండ్లికి ఒక పెద్దకొడుకుగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యావాదములు తెలిపారు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచితంగా 10కిలోల బియ్యం ఇచ్చిందని గుర్తుచేశారు. కర్రీస్‌ పాయింట్ల వద్ద గానీ మరేరకంగా అయిన ప్లాస్టిక్‌ కవర్ల్‌ వాడవద్దని ప్రజలకు హరీశ్‌రావు అవగాహన కల్పించారు. తెలంగాణ సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పథంతో దూసుకెళ్తుందన్నారు. ఇందులో భాగంగా సిద్దిపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

- Advertisement -